Saturday, September 28, 2019

‘సైరా’.. ఒకటి కొంటే మరొకటి ఉచితం! అమెరికా ప్రీమియర్‌ ఆఫర్‌

   హైదరాబాద్‌: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబరు 1న ఈ సినిమా అమెరికాలో విడుదల కాబోతోంది. అక్కడి థియేటర్‌లో సినిమా భారీ సంఖ్యలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థియేటర్ల జాబితాను షేర్‌ చేసింది. అంతేకాదు ఈ సినిమా ప్రీమియర్‌కు కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించారు. ఒక్క టికెట్‌ కొంటే మరో టికెట్‌ ఉచితమని పేర్కొన్నారు. త్వరలోనే బుకింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని అమెరికాలో స్నోఫ్లేక్‌ సినిమా, వీకెండ్‌ సినిమా యూఎస్‌, బిగ్‌ థింక్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. మరోపక్క సోమవారం ‘సైరా’ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమాను చూసిన బోర్డు సభ్యులు ప్రశంసించినట్లు సమాచారం. సింగిల్‌ కట్‌ కూడా లేకుండా సినిమాను ఓకే చేయడం విశేషం. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించారు. అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార, తమన్నా ఇందులో కథానాయికల పాత్రలు పోషించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

No comments:

Post a Comment