Saturday, September 28, 2019

భారత్‌లో బహుదేశ విద్యార్థులు!

ఇక్కడ విద్యనభ్యసిస్తున్న164 దేశాలకు చెందిన 47,427 మంది.                                    అత్యధికంగా కర్ణాటకలో..                                    8, 9 స్థానాల్లో తెలంగాణ, ఏపీ.              హైదరాబాద్‌: ఏటా లక్షల మంది భారతీయులు విద్య కోసం విదేశాలకు వెళ్తుండగా.. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 164 దేశాల విద్యార్థులు మన దేశంలో విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 47,427 మంది విదేశీయులు భారత్‌లో వివిధ కోర్సులు చదువుతున్నట్లు అఖిల భారత ఉన్నత విద్య సర్వే - 2018-19 వెల్లడించింది. అయిదేళ్ల క్రితంతో పోల్చుకుంటే దాదాపు 5 వేల మంది వరకు పెరిగారు. ఈ సారి మొత్తం విదేశీ విద్యార్థుల్లో 26.88 శాతం మంది నేపాల్‌ నుంచి వచ్చారు. అమెరికా నుంచి కూడా 1518 మంది ఉండగా.. వారిలో 53.30 శాతం మంది అమ్మాయిలే కావడం విశేషం. విదేశీ విద్యార్థుల్లో 73.40 శాతం మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌(డిగ్రీ స్థాయి) కోర్సులు, 16.15 శాతం మంది పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. మరోవైపు తెలంగాణకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 2016-17 నుంచి గణనీయంగా తగ్గుతోంది.

No comments:

Post a Comment