Sunday, September 29, 2019

క్రికెటర్ అజార్ కు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ?

September 29 2019: ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ కు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవిని టిఆర్ఎస్ ఆఫర్ చేసిందని వార్త వచ్చింది.ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అద్యక్షుడు అయ్యేందుకు సహకరించిన టిఆర్ఎస్ తాజాగా ఆయనను పార్టీలో చేర్చుకుని,హైదరాబాద్ లో పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ఆలోచిస్తోందట.మంత్రి కెటిఆర్ ను అజార్ ను కలిసిన తర్వాత రాజకీయాలు చర్చించలేదని ఆయన చెప్పినప్పటికీ, ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని అంటున్నారు.అజార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్స్ లో చేరితే రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారట.

No comments:

Post a Comment