Sunday, September 29, 2019

సౌదీ వెళ్లే టూరిస్టులకు హెచ్చరిక.. అక్కడ ఇలాంటివి కుదరవు.

29.09.2019:   ప్రస్తుతం 49 దేశాలకు టూరిస్ట్ వీసాలకు అనుమతినిచ్చినట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా పలు యూరోపియన్ దేశాలు ఉన్నాయి.   సౌదీ చరిత్రలోనే తొలిసారిగా టూరిస్ట్ వీసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. అక్కడికి వచ్చే విదేశీయులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం,బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం వంటి వాటిపై నిషేధం విధించింది. మహిళలు తప్పనిసరిగా తమ భుజాలను,మోకాళ్లను కవర్ చేసుకునేలా దుస్తులు ధరించాలని పేర్కొంది.ఈ నిబంధనలు అతిక్రమించినవారికి భారీ జరిమానా తప్పదు. టూరిస్ట్ వీసాతో సౌదీలో అడుగుపెట్టే విదేశీయులకు అక్కడి పద్దతులపై అవగాహన ఉండాలని తెలిపింది. ప్రస్తుతం 49 దేశాలకు టూరిస్ట్ వీసాలకు అనుమతినిచ్చినట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా పలు యూరోపియన్ దేశాలు ఉన్నాయి. అమెరికా,యూరోప్ లాంటి దేశాల్లో వస్త్రధారణ, బహిరంగ ప్రదేశాల్లో మద్దులు సర్వ సాధారణం.అయితే అలాంటివి సౌదీలో కుదరవు అని చెప్పడానికే అక్కడి ప్రభుత్వం ఈ ఆంక్షలను అమలు చేస్తోంది. కేవలం ఇవి మాత్రమే గాక.. మరో 19 అంశాల్లో సౌదీ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. అయితే వాటికి సంబంధించిన జరిమానా వివరాలు ఇంకా వెల్లడించలేదు.కాగా,ఇప్పటివరకు కేవలం ముడి చమురు పైనే ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న సౌదీ.. పర్యాటక రంగం ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగానే పర్యాటక వీసాలకు తొలిసారిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

No comments:

Post a Comment