Saturday, September 28, 2019

కేసీఆర్ ఆదేశాలు.. హుటాహుటీన మినిస్టర్ క్వార్టర్స్‌కు మంత్రులు!

29 Sep 2019:                                             కొత్త సచివాలయ భవన నిర్మాణాన్ని తర్వగా పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రాంగాణాన్ని మరో రెండు రోజుల్లోగా ఖాళీచేయాలని జీఏడీ ఆదేశించింది.   కొత్త సచివాలయం సమీకృత భవన నిర్మాణం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. మంత్రులంతా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో విధిగా నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులంతా హుటాహుటిన మినిస్టర్స్ క్వార్టర్స్‌కు తరలుతున్నారు. అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్ నగర పరిధిలోని మంత్రులకు మాత్రం మినహాయింపు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ను కూల్చి కొత్తగా నిర్మించనుండటంతో వివిధ శాఖలను వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఆర్థిక, ప్రణాళిక, హోం తదితర శాఖలతో పాటు ఇతర శాఖలను బీఆర్కే భవన్‌కు తరలించారు. సెక్రటేరియట్ భవనాన్ని మాత్రం వీలైనంత త్వరగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాత సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. దీంతో సచివాలయ భవనాల నుంచి శాఖల తరలింపు వేగవంత చేశారు. ఇప్పటికే 90 శాతం బ్లాకులు ఖాళీఅయ్యాయి. ఆదివారం నాటికి ఇవి పూర్తకానున్నాయి. సచివాలయంలోని అన్ని బ్లాకులను సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. బీఆర్కేఆర్ భవన్‌కు వెంటనే తరలిపోవాలని సూచించారు. ఆదివారం ఉదయం పాత సచివాలయ ప్రాంగణం ప్రధాన ద్వారానికి జీఏడీ అధికారులు తాళం వేయనున్నారు. ఈ తాళంచెవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర ఉంటుంది. అవసరం ఉన్నవాళ్లు తాళాలను సీఎస్ దగ్గరి నుంచే తీసుకోవాల్సి ఉంటుందని జీఏడీ స్పష్టం చేసింది. ఏ మంత్రి ఎక్కడ? 1. ముఖ్యమంత్రి - హెచ్ఎంఆర్ఎల్, రసూల్ పురా, బేగంపేట్. 2. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.. డీజీపీ కార్యాలయం, లక్డీకాపూల్. 3. ఈటల రాజేందర్ - బీఆర్కేఆర్ భవన్. 4. ఇంద్ర కరణ్ రెడ్డి - ఎండోమెంట్ కార్యాలయం, బోగ్గులకుంట, అబిడ్స్. 5. కొప్పుల ఈశ్వర్ - సంక్షేమ భవన్. 6. ఎరబెల్లి దయాకర్ రావు - రంగారెడ్డి జడ్పీ కార్యాలయం, ఖైరతాబాద్. 7. జగదీష్ రెడ్డి - టీఎస్ఎస్పీడీపీఎల్, మింట్ కాంపౌండ్. 8. నిరంజన్ రెడ్డి - హాకా భవనం, లక్డీకాపూల్. 9. వి. శ్రీనివాస్ గౌడ్ - రవీంద్ర భారతి, లక్డీకాపూల్. 10. మల్లారెడ్డి - మహిళా శిశు సంక్షేమ భవన్, రోడ్ నెంబర్: 45, జూబ్లీహిల్స్. 11. తలసాని శ్రీనివాస్ యాదవ్ - బీఆర్కేఆర్ భవన్. 12. ప్రశాంత్ రెడ్డి - ఈఎన్సీ, ఎర్రమంజిల్. 13. కేటీఆర్ - మునిసిపల్ కాంప్లెక్స్, ఏసీ గార్డ్స్, మాసబ్ టాంక్. 14. హరీష్ రావు - అరణ్య భవన్, లక్డీకాపూల్. 15. సత్యవతి రాథోడ్ - సంక్షేమ భవన్. 16. గంగుల కమలాకర్ - బీసీ కమిషన్, ఖైరతాబాద్. 17. పువ్వాడ అజయ్ - రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్, ఖైరతాబాద్. 18. సబితా ఇంద్రారెడ్డి - ఎస్సీఈఆర్టీ, బషీర్‌బాగ్. కామెంట్ రాయండి వార్తలు : ఎక్కువ మంది చదివిన కథనాలు మెట్రో విషాదం.. మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు, జాబ్... సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో చూశారా..... నేనొక అనాథ.. క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య, కంటతడి పెట్టిస్తు... వేణుమాధవ్‌ అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి సాయం... TCS ఉద్యోగిని ఆత్మహత్య.. సీసీటీవీలో దృశ్యాలు... మరింత సమాచారం తెలుసుకోండి: తెలంగాణ సెక్రటేరియట్టీఆర్ఎస్కేసీఆర్ts secretariatTRSMinisters Quarterskcr ’సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఫేస్‌బుక్ పేజ్‌ను లైక్ చేయండి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి డౌన్‌లోడ్ హుజూర్‌నగర్‌లో పోటీపై బాబు చర్చలు.. పరిశీలనలో ఆ ఇద్దరి పేర్లు! తరవాత కథనం Web Title : telangana cm kcr orders to minister to stay at ministers quarters (Telugu News from Samayam Telugu , TIL Network) Telugu Newstelangananewstelangana cm kcr orders to minister to stay at ministers quarters తరవాత కథనం హుజూర్‌నగర్‌లో పోటీపై బాబు చర్చలు.. పరిశీలనలో ఆ ఇద్దరి పేర్లు! Samayam Telugu | Updated: 28 Sep 2019, 10:36 AM టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి బలమైన పునాదులు పడ్డాయి. అయితే, రాష్ట్రం విడిపోయాక టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కీలక నేతలందరూ పార్టీని వీడి వివిధ పార్టీల్లో చేరిపోయారు.   తెలంగాణలో ఉప-ఎన్నిక వేడి రాజుకుంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్ స్థానానికి అక్టోబరు 21న ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి, బీజేపీ నుంచి కోట రామారావు అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీచేసిన టీడీపీ కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో తెలంగాణలో టీడీపీకి జవసత్వాలు కూడగట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో పోటీపై ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తెలంగాణ సీనియర్ నేతల అభిప్రాయాలను చంద్రబాబు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌లో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని పలువురు నేతలు ఆయనకు సూచించినట్లు సమాచారం. అభ్యర్థిని నిలిపే అంశంపై శనివారం మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌ టీడీపీ అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి, చావా కిరణ్మయి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు నాలుగు రోజుల కిందట సమావేశమై ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వకుండా.. ఒంటరిగా బరిలోకి దిగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగైతేనే పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని, ఉప ఎన్నికలో సత్తా చాటుతాం పార్టీ నేత నన్నూరి నర్సిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కామెంట్ రాయండి వార్తలు : ఎక్కువ మంది చదివిన కథనాలు మెట్రో విషాదం.. మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు, జాబ్... సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో చూశారా..... నేనొక అనాథ.. క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య, కంటతడి పెట్టిస్తు... వేణుమాధవ్‌ అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి సాయం... TCS ఉద్యోగిని ఆత్మహత్య.. సీసీటీవీలో దృశ్యాలు... మరింత సమాచారం తెలుసుకోండి: హుజూర్‌నగర్ ఉప ఎన్నికటీడీపీచంద్రబాబు నాయుడుTDPhuzurnagar by pollChandrababu Naidu ’సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఫేస్‌బుక్ పేజ్‌ను లైక్ చేయండి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి డౌన్‌లోడ్ కరీంనగర్ సీపీ, ఏసీపీ, సీఐకి ఆర్నెళ్ల జైలు.. హైకోర్టు సంచలన తీర్పు తరవాత కథనం Web Title : tdp may contest huzurnagar by poll in telangana, chandrababu discussion with senior leaders (Telugu News from Samayam Telugu , TIL Network) Telugu Newstelangananewstdp may contest huzurnagar by poll in telangana, chandrababu discussion with senior leaders

No comments:

Post a Comment